Kantha Movie Review
Release Date : Nov 14, 2025
Starring : Dulquer Salmaan, P. Samuthirakani, Bhagyashri Borse, Rana Daggubati, Bijesh Nagesh, Ravindra Vijay and others
Director : Selvamani Selvaraj
నా రేటింగ్:
కాంత సినిమా కి నేను ఇచే రేటింగ్ 5 కి 2.5 స్టార్స్ . ఈ 2.5 స్టార్స్ కూడా కేవలం ఫస్ట్ హాఫ్ కోసం మాత్రమే. సెకండ్ హాఫ్ కథ కి 0 రేటింగ్ ఈవచ్చు.
నటుల గురించి:
నాకైతే దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది అండ్ ఇలాంటి పాత్ర ఆల్రెడీ మనం సావిత్రి సినిమాలో చూసాము తన క్యారెక్టర్ కి తన 100 పర్సెంట్ ఇచ్చేసాడు అండ్ సముద్రకాన్ని గారి గురించి చెప్పుకోవాలి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు సముద్రకని గారికి కొన్ని సన్నివేశాలలో దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రగణి గారు పోటీపడి మరీ నటించారు అలా అనిపిస్తుంది అండ్ భాగ్యశ్రీ బోస్ గారి యాక్టింగ్ చాలా కొత్తగా ఉంది మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు తను కూడా అలాగే పర్ఫార్మ్ చేసి ఆ క్యారెక్టర్ ని చాలా బాగా లాక్కొచ్చింది. ఇక రానా గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నాకైతే అంత నచ్చలేదు అంటే ఇప్పుడు ఇతర క్యారెక్టర్లు మనం చూసినట్లయితే వావ్ అనిపించేలా ఉంటాయి కానీ రానా గారి క్యారెక్టర్లు చూస్తే అది ఏంటో ఎందుకు వచ్చింది రా అనిపించేలా ఉంటుంది అన్నమాట. అనవసరంగా కొన్ని సీన్స్ ఉంటాయి రానా గారితో. ఇక రవీంద్ర విజయ్ గారు కూడా మంచి క్యారెక్టర్ ఉంది అండ్ తన 100 పర్సెంట్ కూడా తన ఇచ్చేసాడు ఇంకా ఇతర క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ల వాళ్ల యాక్టింగ్ అయితే అందరివి బాగున్నాయి.
సినిమా గురించి నా భావన:
అద్భుతమైన టేకింగ్ తో మొదలయ్యి సినిమా ప్రియులకు ఆనందాన్ని ఇచ్చేలా టేకింగ్ అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం మనకేంటంటే యాక్టర్స్ ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మనకి అక్కడ స్టూడియో సెట్స్ యాక్టర్స్ ఒక భావాలు ఎలా తెలియజేస్తారు అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా తీసుకెళ్తారన్నమాట ఫస్ట్ ఆఫ్ మొత్తం ఇలా వెళ్తుంది అండ్ లవ్ స్టోరీ కూడా దుల్కర్ సల్మాన్ గారిది అండ్ భాగ్యశ్రీ వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా అట్రాక్టింగ్ గానే ఉంది. ఇంటర్వెల్ ఎపిసోడ్లో భాగ్యశ్రీ బోస్ అంటే హీరోయిన్ నీ చంపేస్తారు సెకండాఫ్ మొత్తం మనకి ఆ హత్య ఎవరు చేశారు ఆ ఇంటరాగేషన్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది అది కొంచెం కాదు చాలా కనిపిస్తాదన్నమాట మనకి రానా గారి ఆక్టింగ్ అయితే కొంచెం నాచురల్ గా లేకుండా ఇక్కడ చేయాలి ఈ యాక్టింగ్ అనేలా ఉంటుంది కొన్ని సీన్స్ సో నాకు సెకండాఫ్ అయితే అసలు నచ్చలేదు. ఇక ముఖ్యంగా మాట్లాడుకుంటే దుల్కర్ సల్మాన్ మరియు సముద్రఖని గారి మధ్య ఉండే సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అది ఫస్ట్ ఆఫ్ లో కావచ్చు సెకండ్ హాఫ్ లో కావచ్చు కానీ ఇద్దరు ఈకోటిక్స్ ఒక్కసారిగా మంచోళ్ళు అయిపోతారు అక్కడ అంత ఎమోషన్ ఏం క్యారీ చేసిందో నాకైతే అర్థం కాలేదు.
